Pavan Kalyan: షూటింగ్ లో పాల్గొనబోతున్న పవన్..! 24 d ago
పవన్ కళ్యాణ్ ప్రముఖ పాత్రలో జ్యోతి కృష్ణ తెరకెక్కించనున్న చిత్రం "హరి హర వీర మల్లు". గత ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సిఎం గా పదవి స్వీకరించిన తరువాత షూటింగ్ నిలిపివేశారు. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడం తో షూటింగ్ త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా మూవీ టీం షూటింగ్ చివరి దశకు వచ్చిందని ఈ వారం షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారని తెలిపారు. 2025 మార్చ్ 28న ఈ మూవీ రిలీజ్ కానుంది.